Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 19, 2013

యెహెజ్కేలు34వఅధ్యాయము

1  మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 
2  నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరు లతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొర్రెలను మేపవలెను గదా. 
3  మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు, 
4  బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. 
5  కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. 
6  నా గొర్రెలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొర్రెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు. 
7  కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి 
8  కాపరులు లేకుండ నా గొర్రెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 
9  కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. 
10  ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగానా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొర్రెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొర్రెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 
11  ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. 
12  తమ గొర్రెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి 
13  ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. 
14  నేను మంచి మేతగలచోట వాటిని మేపె దను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును, 
15  నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 
16  తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను. 
17  నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను. 
18  విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? 
19  మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలకలు చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా? 
20  కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. 
21  మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు. 
22  నా గొర్రెలు ఇక దోపుడు కాకుండ గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను. 
23  వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. 
24  యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను. 
25  మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయు దును. 
26  వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును, 
27  ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు. 
28  ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షిత ముగా నివసించెదరు. 
29  మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారికవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతి కొరకై తోట యొకటి నేనేర్పరచెదను. 
30  అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 
31  నా గొర్రెలును నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు. 

No comments:

Post a Comment