Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 19, 2013

యెహెజ్కేలు15వఅధ్యాయము

1  మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 
2  నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినచెట్ల కఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా? 
3  యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించు టకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా? 
4  అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? 
5  కాలక ముందు అది యే పనికిని తగక పోయెనే; అగ్ని దానియందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? 
6  కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను అగ్ని కప్పగించిన ద్రాక్షచెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను. 
7  నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు. 
8  వారు నా విషయమై విశ్వాసఘాతకు లైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభు వగు యెహోవా వాక్కు. 

No comments:

Post a Comment